: యూఎస్ ఎంబసీపై దాడికి కుట్ర పన్నిన ఇండోనేషియా టెర్రరిస్టులు హతం
కొత్త ఏడాదిలో ఇండోనేషియాలోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడికి కుట్ర పన్నిన ఆరుగురు అనుమానిత టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. ఒక్క ఎంబసీపైనే కాకుండా చర్చి, బౌద్ద ఆలయంపైన దాడికి ప్రణాళిక వేశారని, ఈ మేరకు తొమ్మిది గంటలపాటు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో చేతి రాతతో ఉన్న ఓ డాక్యుమెంటును పోలీసులు స్వాధీనపర్చుకున్నట్లు జాతీయ పోలీసు అధికార ప్రతినిధి ఒకరు వివరించారు. అందులో ఎక్కడెక్కడ దాడి చేయాలి వంటి వివరాలు రాసి ఉన్నట్లు తెలుస్తోంది.