: మాదక ద్రవ్యాల కేసులో దోషిగా తేలితే విజేందర్ పై నిషేధం!
మాదక ద్రవ్యాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాక్సర్ విజేందర్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు రుజువైతే 'జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ' నుంచి పెద్ద చిక్కుల్లోనే పడతాడు. ఈ కేసులో విజేందర్ నిందితుడిగా తేలితే 2 సంవత్సరాల పాటు నిషేధం ఎదుర్కొంటాడని సంస్థ వెల్లడించింది. దీనిపై ఆ సంస్థ
డైరెక్టర్ జనరల్ ముకుల్ చటర్జీ మాట్లాడుతూ.. హెరాయిన్ ఆగటాళ్ల బల
ప్రదర్శనను తాత్కాలికంగా పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు.
కాగా, ఈ కేసులో వైద్య పరీక్షల నిమిత్తం రక్త నమూనాలను, కేశాలను ఇచ్చేందుకు విజేందర్ మొదటి తిరస్కరించినప్పటికీ అనంతరం అంగీకరించాడు. ఇదే కేసులో అతని స్నేహితుడు, జాతీయస్థాయి బాక్సర్ రామ్ సింగ్ ను ఇప్పటికే జాతీయ శిక్షణా శిబిరం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.