: అప్పుడు మానాన్న ఎదురొడ్డారు..ఇప్పుడు మేమే అడ్డుకుంటాం: కాసు


ఇందిరాగాంధీకి ఎదురొడ్డి విభజనను అడ్డుకున్న ఘనత తన తండ్రి కాసు బ్రహ్మానందరెడ్డికి ఉందని, ఇప్పడు మరోసారి ఆయన వారసులుగా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. అవసరమైతే అధిష్ఠానాన్ని కూడా ధిక్కరిస్తామని ఆయన తెలిపారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉంటూ రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News