: జస్టిస్ గంగూలీపై చర్య వద్దంటూ సుప్రీంలో పిటిషన్


పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుంగూలీపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పద్మానారాయణ్ సింగ్ దీన్ని దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ సదాశివం నేతృత్వంలోని బెంచ్ దీన్ని పరిశీలించిన అనంతరం సోమవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. జస్టిస్ గంగూలీ తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని న్యాయ విద్యార్థిని ఒకరు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై విచారణకు రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు నివేదించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయమూ తెలిసిందే.

  • Loading...

More Telugu News