: శాంతి కోసం మాల్దీవులతో కలిసి పనిచేస్తాం: ప్రణబ్
హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో శాంతి కోసం మాల్దీవులతోపాటు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని రాష్ట్రపతి ప్రణబ్ తెలిపారు. తనను కలిసిన మాల్దీవుల అధ్యక్షుడు అబ్దల్ గయూమ్ తో ప్రణబ్ చర్చలు జరిపారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిగా భారత్ లోనే పర్యటిస్తున్నానని గయూమ్ ప్రణబ్ తో చెప్పారు. మాల్దీవుల్లో అధికారం సాఫీగా బదిలీ కావడం అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతానికి తోడ్పడుతుందని ప్రణబ్ అన్నారు. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని చెప్పారు.