: ఎంపీల దీక్ష అడ్డుకునేందుకు ఓయూ విద్యార్థుల ప్రయత్నం
ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర ప్రాంత ఎంపీలు చేపట్టిన సంకల్పదీక్షను అడ్డుకునేందుకు ఓయూ విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓయూ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని వారిని అడ్డుకోవడం సరికాదని పోలీసులు నచ్చజెబుతున్నా వినకపోవడంతో విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలిచారు.