: మోడీపై ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నా: రాజ్ నాథ్ సింగ్
బీజేపీ అభ్యర్ధి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అంతకన్నా వినాశనం మరొకటి ఉండదన్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. 2002లో గుజరాత్ అల్లర్లు దురదృష్టకరమని పేర్కొన్న రాజ్ నాథ్.. అల్లర్లలో మోడీ ప్రమేయం లేదని కోర్టులే చెప్పాయని గుర్తు చేశారు. ఇదే విషయంపై బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. 'ప్రధానిగా పదేళ్లపాటు ఉండి దేశాన్ని, ప్రజలను మీరే నాశనం చేశారు' అని ట్విట్టర్ లో తిప్పి కొట్టారు.