: భారత్ పోటీపడే స్థాయికి ఎదిగింది: అమెరికా రాయబారి నాన్సీ పావెల్
భారతదేశం ప్రపంచదేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగిందని భారత్ లో ఆమెరికా రాయబారి నాన్సీ పావెల్ అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో స్టాండర్డ్ అండ్ పూర్ క్యాపిటల్ ఐక్యూ సంస్థను సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత్ లో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో అమెరికా సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని అన్నారు. అలాగే పనిచేసే చోట్ల మహిళలు చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించి మన్ననలు కూడా అందుకుంటున్నారని ఆమె ఉమెన్స్ నెట్ వర్కింగ్ గ్రూప్ సభ్యులతో అన్నారు.