: సంకల్ప దీక్ష కాదది...సామాన్య దీక్ష: దేవినేని ఉమా


రాష్ట్ర శాసనసభలో విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద సీమాంధ్ర ఎంపీలు చేపట్టినది సంకల్ప దీక్ష కాదని, సామాన్య దీక్ష మాత్రమేనని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా దుయ్యబట్టారు. ఈరోజు ఉమా శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలకు నిజంగానే సంకల్పం ఉంటే.. హైదరాబాదులో కాదు, ఢిల్లీలో సోనియా ఇంటి ముందు ధర్నా, దీక్షలు చేయాలని ఆయన సూచించారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై రోజుకో మాట మాట్లాడుతూ నాటకాలాడుతోందని ఆరోపించారు. సీఎం కిరణ్ మాత్రం సమైక్యవాదినంటూ అసత్యాలు పలుకుతున్నారని, ఇదంతా సోనియా కనుసన్నల్లోనే కొనసాగుతోన్న తతంగమేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో సీఎం కిరణ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాలకు ఓటమి చవిచూడక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News