: బీజేపీలో చేరిన మాజీ రాయబారి హరదీప్ పూరీ


మరో మూడు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే చేరుతుండటం గమనార్హం. తాజాగా, యూఎన్ శాశ్వత రాయబారిగా పనిచేసిన హరదీప్ పూరి బీజేపీలో చేరారు. 1974 బ్యాచ్ కు చెందిన పూరీ.. 39 సంవత్సరాల పాటు సేవలందించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పలు పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన పూరీ, రక్షణ శాఖలోనూ పనిచేశారు. అంతేగాక లండన్, బ్రెజిల్ దేశాల్లో రాయబారిగా పదవులు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News