: సన్యాసం కాదు.. విరామమే: అజిత్ జోగి


ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అజిత్ జోగి రాజకీయాలలో మళ్లీ బ్రేక్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఇటీవల శాసనసభ ఎన్నికల ముందు వరకూ ఆయన బ్రేక్ లోనే ఉన్నారు. ఎన్నికలకు కొంత కాలం ముందుగా బాధ్యతలు నెత్తిన వేసుకుని కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. కానీ అక్కడి ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కట్టడంతో పాపం అజిత్ జోగి తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోనున్నారంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అజిత్ జోగి స్పందిస్తూ సన్యాసం కాదు.. విరామమే తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఓ ఏడాది తర్వాత మళ్లీ వస్తానని ప్రకటించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ పాల్గొనడం లేదని ఆయన గతంలోనే ప్రకటించారు.

  • Loading...

More Telugu News