: 'వోగ్' మ్యాగజైన్ పై మెరిసిన మిచెల్లీ ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా ప్రముఖ ఫ్యాషన్ పత్రిక 'వోగ్' తాజా సంచిక కవర్ పేజీపై మెరిశారు. నీలంరంగు డ్రెస్ ధరించి, చిరునవ్వులు చిందిస్తూ, ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఈ నల్ల కలువ అభిమానులను కట్టిపడేశారు. 'ప్రథమ మహిళ, అధ్యక్షుడు కలిసి అమెరికాను ఎలా ఉత్తేజపరుస్తున్నారు?' అన్న అంశంపై మిచెల్లీతో సచిత్ర, సవివర కథనం కూడా లోపలి పేజీలలో ఇచ్చారు.

"మన ప్రధమ కర్తవ్యం
.. కుటుంబాన్ని సరైన మార్గంలో పెట్టడం. ఎందుకంటే మనకు చిన్న పిల్లలు ఉన్నారు. వారు పెరుగుతూ ఉంటారు. ఈ విషయంలో మనమంతా చాలా కచ్చితంగా ఉండాలి. మన మొదటి ప్రాధాన్యం కుటుంబాన్ని సరిగా ఉంచడం" అంటూ 'వోగ్' పత్రిక ఇంటర్వ్యూలో మిచెల్లీ సందేశాన్ని ఇచ్చారు. 

  • Loading...

More Telugu News