: ఐరాస భద్రతా మండలిలో చేరిన ఐదు కొత్త దేశాలు
నూతన సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాజాగా ఐదు కొత్త దేశాలు వచ్చి చేరాయి. చాద్, చిలీ, జోర్డాన్, లిథువేనియా, నైజీరియా దేశాలు రొటేషన్ పద్ధతిలో రెండు సంవత్సరాల పాటు భద్రతా మండలిలో కొనసాగనున్నాయి. అజర్ బైజాన్, గ్వాటిమాలా, మొరాకో, పాకిస్తాన్, టోగోల స్థానంలో ఈ దేశాలు మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా స్థానం సంపాదించాయి.