: హీరో విశాల్, విజయ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారా?
తెలుగు, తమిళ సినీ నటుడు విశాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏఫీ)లో చేరుతాడని కోలీవుడ్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా విశాల్ కు తమిళనాడులో ఏఏపీ పగ్గాలు అందించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై అటు ఏఏపీ అధికార వర్గాలు, ఇటు విశాల్ స్పందించలేదు. అయినా తమిళనాట సినీనటుల రాజకీయ ప్రవేశం సాధారణం. అదీ కాకుండా అన్నాహజారే ఉద్యమం సమయంలో విశాల్ జోరుగా స్పందించాడు. దీంతో విశాల్ ను ఏఏపీలోకి ఆహ్వానించి పగ్గాలు కట్టబెట్టనున్నట్టు సమాచారం. కాగా మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఏఏపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.