: ఇక డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాసవడం చాలా ఈజీ


మొదటిసారిగా డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకునే వారు లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణా శాఖ పెట్టే కంప్యూటర్ పరీక్షలో 20 శాతం మంది బోల్తా కొడుతున్నారట. ముఖ్యంగా చదువుకున్న యువకులే వీరిలో ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ బాధలు పడలేని వారు దళారులను ఆశ్రయించి ఎల్ఎల్ఆర్ లైసెన్స్ ను తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మోడల్ టెస్ట్ పేపర్లను వెబ్ సైట్ లో పెట్టింది. వాటిని చూసి ప్రాక్టీస్ చేసుకుని పరీక్ష రాస్తే పాసవడం చాలా సులభమని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం www.aptransport.org వెబ్ సైట్ చూడవచ్చు.

  • Loading...

More Telugu News