: అరవింద్ కేజ్రీవాల్ అంటే..మాటలు కాదు చేతల సీఎం


కేజ్రీవాల్ మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా పేరుతెచ్చుకుంటున్నారు. తొలి సంతకంతోనే రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన కేజ్రీవాల్ తాజా చర్య ప్రజల ప్రశంసలు అందుకుంటొంది. వీఐపీ, సెలబ్రిటీ హోదాలు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే తప్ప, ఇంకెందుకూ పనికిరావని బలంగా నమ్మే కేజ్రీవాల్, ముఖ్యమంత్రి కార్యాలయానికి సాదాసీదా ఉద్యోగి మాదిరిగానే వెళ్లారు. భారీ కాన్వాయ్, ఎర్రబుగ్గకారు, చుట్టూ వందిమాగధులు వంటి హంగామా లేకుండా తన వ్యాగనార్ కారులో 16 కిలోమీటర్ల దూరమున్న ముఖ్యమంత్రి కార్యాలయానికి సాధారణ పౌరుడిగానే వెళ్లారు.

మార్గమధ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగుతూ వెళ్తున్న కేజ్రీవాల్ ను చూసిన ప్రజలు అభినందిస్తూ, కరచాలనం చేస్తూ.. తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటూ వెళ్లారు. అధికారం చేపట్టినా, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న విధానంపై ఢిల్లీ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి రాజకీయ నాయకులు వస్తే దేశం కచ్చితంగా అభివృద్ధి సాధిస్తుందని, దటీజ్ కేజ్రీవాల్ అని వారు ఆనందిస్తున్నారు.

  • Loading...

More Telugu News