: నందన్ నిలేకని తరపున ప్రచారం చేస్తానంటున్న ఇన్ఫోసిస్ మాజీ సభ్యుడు


ఆధార్ ఛైర్మన్ నందన్ నిలేకనీ కాంగ్రెస్ టికెట్ పై లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తే ఆయన తరఫున తప్పకుండా ప్రచారం చేస్తానని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ వి.బాలకృష్ణన్ తెలిపారు. నిలేకనీ అంటే తనకు గౌరవం ఉందని, గతంలో నిలేకనిని కలిసినప్పుడు ఆయన తరఫున ప్రచారం చేస్తానని చెప్పానన్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలగిన బాలకృష్ణన్ ఏఏపీలో చేరారు. అంతేకాక మంచి చరిత్రగల వారే అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటుందని ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. గతంలో నీలేకని, బాలకృష్ణన్ ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఇద్దరూ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేశారు. అయితే, ఇటీవల 2014 కాంగ్రెస్ పీఎం అభ్యర్థి నిలేకనియే అంటూ వార్తలు కూడా వచ్చాయి.

  • Loading...

More Telugu News