: మచిలీపట్నంలో చేనేత కేంద్రం: కావూరి
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యట్ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. దీని వ్యయం 35 కోట్ల రూపాయలని తెలిపారు. గూడూరు మండలంలోని కప్పలదొడ్డి గ్రామంలో చీరల అల్లికలపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని నిన్న రాత్రి ప్రారంభించిన సందర్భంగా కావూరి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో నాలుగు హ్యాండ్లూమ్ ఇనిస్టిట్యూట్స్ పనిచేస్తున్నాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని నేత కార్మికుల కోసం 45 కోట్ల రూపాయల సబ్సిడీని మంజూరు చేశామని తెలిపారు. అనంతరం పెడనలో చేనేత వస్త్రాల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.