: సీఎంపై ఉద్దేశంతో అలా అనలేదు: ఎంపీ పొన్నం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదో ఉద్దేశంతో అనలేదని ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆవేశంలోనే అలా అన్నట్లు తెలిపారు. సీఎంపై అన్న మాటలను అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు. తానేమి ఉగ్రవాదిని, క్రిమినల్ ను కాదన్న పొన్నం రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరిస్తానని పేర్కొన్నారు. కాగా, మంత్రి శ్రీధర్ బాబును రాజీనామా చేయవద్దని తాము చెప్పామని తెలిపారు.

  • Loading...

More Telugu News