: సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
అక్రమాస్తుల కేసులో విచారణకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఆయనతో పాటు విజయసాయి రెడ్డి, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాస్ లో కూడా న్యాయస్థానానికి వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం జగన్ కేసు విచారణ ఫ్రిబవరి 12కు వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున కోర్టుకు హాజరుకాలేమని ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, మోపిదేవి వెంకటరమణ కోర్టుకు తెలిపారు.