: మళ్లీ సొంతగూటికి వెళుతున్న యడ్యూరప్ప!


భారతీయ జనతాపార్టీ (బీజేపీ) నుంచి బయటికొచ్చి కర్ణాటక జనతా పార్టీ (కేజీపీ)ని స్థాపించిన యడ్యూరప్ప ఇప్పుడు అదే పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో తమ హవా కొనసాగించాలని చూస్తున్న బీజేపీ యెడ్డీని తిరిగి తన పార్టీలోకి కొన్ని రోజుల కిందట ఆహ్వానించింది. ఈ మేరకు కర్ణాటక సీనియర్ నేతలకు సమాచారం పంపింది. ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన యెడ్డీ.. కేజీపీని కమలంలో కలపనున్నట్లు స్వయంగా ప్రకటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పోరాటం చేస్తానని యడ్యూరప్ప చెప్పారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ అధిష్ఠానం కూడా స్వాగతించింది.

  • Loading...

More Telugu News