: మరికాసేపట్లో నోరు విప్పనున్న ప్రధాని.. ఏం చెప్పనున్నారు?
తొమ్మిదిన్నరేళ్లపాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ముచ్చటగా మూడోసారి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 11గంటలకు ఢిల్లీలో ప్రధాని మీడియాతో మాట్లాడతారు. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయమే మిగిలి ఉన్న సమయంలో ప్రధాని మీడియా సమావేశంలో ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది. రాజీనామా ప్రకటిస్తారని కొందరు.. లేదు లేదని కొందరు అంటున్నారు. రాజీనామాకు అవకాశాలు లేవుకానీ.. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే విషయంలో మార్గం సుగమం చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.