: రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలని ఉందా? అయితే పదండి
రాష్ట్రపతి ఏటా శీతాకాలంలో దక్షిణ భారతంలో విడిది చేసే రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలని ఉంటే.. ఆ కోరిక తీర్చుకోవచ్చు. సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని ఈ నెల 6 నుంచి 12 వరకు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సందర్శకులను అనుమతించనున్నారు.