: టీనేతలంతా కలసి శ్రీధర్ బాబును బలిపశువును చేశారు: మంత్రి టీజీ


మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ బాబుపై సీమాంధ్రకు చెందిన మంత్రి టీజీ వెంకటేష్ సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలంతా కలసి ఆయన్ను బలిపశువును చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టే టీమంత్రులంతా... నిజంగా అన్యాయం జరిగినట్టైతే, అందరూ కలసి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని సూచించారు. వీరంతా పదవులు పట్టుకుని వేలాడుతూ, శ్రీధర్ బాబును మాత్రం బలిపశువును చేశారని అన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి టీజీ మాట్లాడారు.

  • Loading...

More Telugu News