: ఆరోగ్యానికి నిజంగా నే'రేడు'!


సంవత్సరం మొత్తంలో ఒక సీజన్‌లో మాత్రమే లభించే పండ్లు నేరేడు పండ్లు. చక్కగా నిగనిగలాడుతూ కనిపించే నేరేడు పండ్లు మన కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటికి పంపడంలో చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి. ఈ పండ్లు ఎంతటి సుగుణాలను కలిగివున్నాయంటే... పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కూడా కోసేసి ఇవి చక్కగా బయటికి పంపేస్తాయి. అంతటి శక్తి నేరేడు పండ్లకు ఉంది.వీటిని గర్భిణీ స్త్రీలు మినహా మిగిలిన అందరూ కూడా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు కడుపులో పేరుకుపోయిన పదార్ధాలను తొలగించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా షుగరు రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి నేరేడు పండ్లు దొరికే సమయంలో అందరూ చక్కగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News