: ఈ విషయంలో కూడా మగువలు మగవారితో సమానం కాదట!


ఇప్పటి వరకూ చాలా విషయాల్లో మగువలు మగవారితో సమానం కాదు అనే విషయం ఎప్పటికప్పుడు వెల్లడవుతోంది. ఇప్పుడు జబ్బుల్లో కూడా మగవారితో మగువలు సమానం కాదని పరిశోధకులు చెబుతున్నారు. మగవారితో పోల్చుకుంటే మగువలు కాస్త భిన్నంగా ఉంటారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రక్తపోటు విషయంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకటేనని భావిస్తూ వైద్యులు ఇద్దరికీ సమానమైన వైద్యం చేస్తూ వచ్చారు. కానీ రక్తపోటును తగ్గించే మందుల విషయంలో లైంగిక తేడాను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రొఫెసర్‌ కార్లోస్‌ ఫెరారియో నేతృత్వంలో కొందరు పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో అధిక రక్తపోటు వల్ల మగువలకే ఎక్కువగా ప్రమాదం పొంచివుందన్న విషయం బయటపడింది. అంతేకాదు, రక్తపోటు పెరగడానికి కారణమయ్యే అంశాలు కూడా మగువల్లో భిన్నంగా ఉంటున్నట్టు తొలిసారిగా వెల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు. స్త్రీ, పురుషులిద్దరిలో అధిక రక్తపోటు ఒకేస్థాయిలో ఉన్నా కూడా రక్తనాళాల జబ్బు పురుషుల్లోకన్నా స్త్రీలలో 30 నుండి 40 శాతం ఎక్కువగా ఉంటున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. రక్తపోటును నియంత్రించే హార్మోన్ల స్థాయిలు, వాటి రకాలతో సహా మగువల గుండె రక్తనాళాల వ్యవస్థలోనే గణనీయమైన తేడాలు ఉంటున్నట్టు తేలిందని, అందువల్ల మహిళల్లో అధిక రక్తపోటు ప్రక్రియను మరింత బాగా అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉందని, వారికి మందుల మోతాదుల ఎంపికకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఫెరారియో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News