: మాటలు నేర్చిన చిలుక వెల లక్ష!!
ఒక సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ ఒక మేకను అమ్మకానికి పెట్టి అది మాటలు నేర్చిన మేకని చెబుతాడు... ఏప్రిల్ తర్వాత వచ్చే నెల ఏదంటూ మేకను ఒక్కటిచ్చుకుంటాడు... దానికి అది 'మే' అని అరుస్తుంది. ఇలా ఆ మేకను ఎక్కువ రేటుకు అమ్మేస్తాడు. అలా ఒక మాటలు నేర్చిన చిలుక ఏకంగా లక్ష రూపాయల ధర పలికింది. ఒక చిలుకకు అంత రేటు ఎందుకో.... అంటే అది మాటలు నేర్చిన చిలుక కాబట్టే అంత రేటు అంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల వెంకట రామ్మోహనరావు ఇంట్లో ఒక చిలుక ఉంది. దీనిపేరు హార్స్‌లీ. దీన్ని ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకున్నారు. ఇది చూసేందుకు పావురంలాగా ఉంటుంది. కానీ ఇది ఆస్ట్రేలియన్ మకావ్. ఇంతకూ దీని స్పెషాలిటీ ఏంటంటే... ఇది చక్కగా మాట్లాడుతుంది. పొద్దునే గుడ్‌మార్నింగ్ చెబుతుంది. రాత్రి కాగానే చక్కగా గుడ్‌నైట్ చెప్పి పడుకుంటుంది. ఒకవేళ మీ ఫోన్ రింగయితే హలో అంటుంది... ఇంకా మమ్మీ, బాబీ, రామా అంటూ ముచ్చటగా పలుకుతోందట. మాట్లాడే చిలుక కాబట్టే అంత రేటుమరి!