: రాష్ట్ర సమైక్యతపై చర్చ జరగాలి: చలసాని శ్రీనివాస్
రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేలా అసెంబ్లీలో రాష్ట్ర సమైక్యతపై సమగ్ర చర్చ, తీర్మానం జరగాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సలహాదారు చలసాని శ్రీనివాస్ సూచించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్పును తెలంగాణ నేతలు వివాదం చేస్తున్నారని అన్నారు. ఈ నెల 17 నుంచి చేపట్టే సమైక్యాంధ్ర మహోద్యమంలో అందరూ పాల్గోవాలని ఆయన పిలుపునిచ్చారు.