: కరీంనగర్ జిల్లాకు కొత్త సిటీ బస్సులు వచ్చేశాయ్
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జెఎన్ఎన్‌యుఆర్ఎం) పథకం కింద కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కరీంనగర్ జిల్లాకు 70 బస్సులను, ఒక డిపోను మంజూరు చేస్తూ ఇవాళ (గురువారం) ఆదేశాలు జారీ చేసింది. ఈ బస్సులకయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 21 కోట్ల రూపాయల నిధులను సమకూర్చగా, రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల 27 లక్షలను మంజూరు చేసింది. మొత్తం 26 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ప్రారంభమవుతున్న ఈ పథకం ద్వారా బస్సులను సిటీ సర్వీసెస్ కింద జిల్లాలో నడుపుతారు. ఇప్పుడున్న రెండు బస్సులు సహా 72 సిటీ బస్సులు జిల్లాలో నడవనున్నాయి. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 13 పట్టణాలకు నిధులు మంజూరు చేసింది. మన రాష్ట్రంలో 12 పట్టణాలకు సిటీ సర్వీసులు కావాలంటూ ఏకేఖాన్ ప్రతిపాదనలు పంపగా... కరీంనగర్ ఒక్కటే అందుకు ఎంపికైంది.