: ఏం మాట్లాడాలో తెలియడం లేదు... ఇది సిగ్గుచేటు: సౌరవ్ గంగూలీ
పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన బాలికపై సామూహిక అత్యాచారం, కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ అత్యంతకిరాతక చర్యను ఖండిస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా తనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని, ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటని అన్నాడు. ఇంతటి అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని అన్నాడు. రేపిస్టులనే కాకుండా రేపిస్టులకు సహాయపడేవారిని కూడా వదలకూడదని ఆయన సూచించాడు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని సౌరవ్ కోరాడు.