: సమైక్య తీర్మానం పెట్టాలని సీఎం చూస్తున్నారు: డీఎస్


అసెంబ్లీ సమావేశాల్లో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం చూస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్ డీ.శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రిగా, నేతగా కిరణ్ కుమార్ రెడ్డి అర్హత కోల్పోయారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీధర్ బాబు మంత్రిగా కొనసాగాలన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న తన ధైర్యాన్ని అభినందిస్తున్నానని అన్నారు. సీఎం చెబుతున్నట్టు శ్రీధర్ బాబుకు ఉన్న సమర్థత, శాసనసభ వ్యవహారాల నిర్వహణకు పనికి రాదా? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి రెండో వారంలో విభజన ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

  • Loading...

More Telugu News