: రాష్ట్రానికి పయనమైన ముఖ్యమంత్రి
రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలో ఉన్న రెండు రోజులూ ప్రధాన నేతలతో బిజీ బిజీగా గడిపిన ముఖ్యమంత్రి...ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ ఓరా తదితర ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే.