: తెలంగాణ బిల్లు ఫిబ్రవరి కల్లా పార్లమెంటుకొస్తేనే..లేకుంటే?: అద్వానీ
తెలంగాణ బిల్లు ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తే ఆమోదం పొందుతుందని, లేకుంటే ప్రస్తుతానికి లేనట్టేనని బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతోనే పార్లమెంటును ప్రోరోగ్ చేయలేదని అన్నారు. అయితే ఫిబ్రవరిలో జరిగే సమావేశాలే చివరి పార్లమెంటు సమావేశాలు అయినందున, సవరణలతో కూడిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఒక వేళ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలేకపోతే ప్రస్తుతానికి లేనట్టేనని, ఎన్నికల తరువాతే బిల్లు చర్చకు వస్తుందని ఆయన వెల్లడించారు. మే నెలాఖరుతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ గడువు ముగుస్తున్నందున ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.