: ఐటీ దిగ్గజాల పొలిటికల్ వార్.. నందన్ నిలేకని వర్సెస్ బాలకృష్ణన్


దేశంలో ఐటీ దిగ్గజాల మధ్య పొలిటికల్ వార్ కి తెరలేచింది. ఆమ్ ఆద్మీ పార్టీ పుణ్యమా అని విద్యావంతులు, సేవాభావం కలిగి ఉన్నత ఉద్యోగాల్లో పని చేస్తున్న పలువురు రాజకీయాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఐటీ ప్రముఖులు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. దీంతో తాజగా దేశ రాజకీయ యవనికపై ఐటీ వార్ కి రంగం సిద్ధమవుతోంది. ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని, అదే సంస్థకు చెందిన మాజీ సీఎఫ్ఓ బాలకృష్ణన్ లు బెంగళూరులో ముఖాముఖి తలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ విప్లవంతో స్ఫూర్తి పొందిన బాలకృష్ణన్ ఆప్ లో సభ్యత్వం కూడా తీసుకుని ఉద్యోగాన్ని వదులుకున్నారు. కాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఆధార్) ప్రాజెక్టు చైర్మన్ నందన్ నిలేకని... కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు. నిలేకనిని దక్షిణ బెంగళూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ బాలకృష్ణన్ ను బరిలో దించేందుకు రంగం సిద్ధం చేసింది. కొసమెరుపేంటంటే, తాను నిలేకనిపై పోటీ చేసేందుకు ఆప్ లో చేరలేదని... పైగా ఎన్నికల్లో నిలేకని తరఫున ప్రచారం చేస్తానని కూడా ఆయనకు మాటిచ్చానని బాలకృష్ణన్ చెబుతున్నారు. కేజ్రీవాల్ ఆదేశిస్తే మాత్రం ఆయన బరిలో దిగక తప్పదు. దీంతో వీరి మధ్య పోటీపై ఐటీ పరిశ్రమ ఆసక్తి కనబరుస్తోంది.

  • Loading...

More Telugu News