: లలిత్ మోడీపై సుప్రీంకోర్టులో బీసీసీఐ పిటిషన్
రాజస్థాన్ క్రికెట్ ఆసోసియేషన్ (ఆర్ సీఏ) అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన లలిత్ మోడీపై బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లలిత్ మోడీని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడు కాకుండా ఆపాలంటూ అందులో పేర్కొంది. ఆర్ సీఏ కు హెడ్ గా మోడీ ఉంటే ఆ ప్రభావం మిగతా వాటిపై పడుతుందని, దానివల్ల క్రికెట్ బోర్డు పేరు దెబ్బతింటుందని వివరించింది. ఐపీఎల్ కమిషనర్ గా ఉన్న సమయంలో లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో... 2013 సెప్టెంబర్ న బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది.