: రాష్ట్రంలోనే తొలిసారిగా.. వినూత్న గ్రామ సభలు ప్రారంభం
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి నుంచి గ్రామ సభలు వినూత్నంగా ప్రారంభమవుతున్నాయి. జిల్లా పరిధిలోని 940 పంచాయతీల్లో ఈ సభలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి మొదలయ్యే గ్రామ సభలు ఈ నెల పదో తేదీ వరకు కొనసాగుతాయి. చిల్లకూరు మండలం పాలిచర్లలో జరిగే ప్రారంభ సభలో జిల్లా కలెక్టర్ పాల్గొంటున్నారు. ఆయనతో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. ఓటుహక్కు కలిగిన వారు మాత్రమే ఈ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ గ్రామ సభల్లో ఓటింగ్ కీలకం కానుంది. ఎవరికైనా ఫించను, రేషన్ కార్డు, రోడ్ల నిర్మాణం, బ్యాంకు రుణాలకు సంబంధించిన అంశాలపై ఓటర్లు గ్రామసభలకు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది. మెజార్టీ ఓటర్ల నిర్ణయం ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రజలకు అందుతాయి. గ్రామ సభల్లో జరిగే నిర్ణయాలను వీడియో చిత్రీకరణ జరిపి రికార్డు చేస్తారు.