: ఏఏపీ దేశానికి ప్రమాదకరం: బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికి ప్రమాదకరమని బీజేపీ నేత హర్షవర్ధన్ అన్నారు. ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీలో ఏఏపీ విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఏపీ నేతలు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తూ చౌకబారు ప్రచారం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. మెట్రోల్లో ప్రయాణించడం గొప్ప కాదని... ఆ పని తాము కూడా చేయగలమని అన్నారు. కేజ్రీవాల్, మనీష్ శిసోడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీలో ఏఏపీ నేత మనీష్ శిసోడియా కాసేపటి క్రితం విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.