: ముందు చంద్రబాబు, జగన్ లకు ఉరెయ్యాలి: ఎంపీ పాల్వాయి
అవినీతి పరులను ఉరితీయాలంటే ముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉరెయ్యాలని ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. జగన్ అవినీతిని ఆంధ్రా ఎంపీలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్న పాల్వాయి వారికి ఆ దమ్ము లేదని ఎద్దేవా చేశారు. కాబట్టి, జగన్, బాబు అవినీతిని ప్రజలే తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణా రాష్ట్రం ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చిపోయిందన్న మాటలను ఆయన ఖండించారు. అసలు తెలంగాణ రావడానికి చంద్రబాబే కారణమన్నారు.