: అధికారులను వాడుకోలేదు: పారికర్


ప్రభుత్వాధికారులను తన కుమారుడి పెళ్లి పనులకు వినియోగించారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. పనాజీలో ఆయన మాట్లాడుతూ గత నెల 26న జరిగిన తన కుమారుడి పెళ్లి వేడుకలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేదని అన్నారు. తానెప్పుడూ అధికారులను సొంత పనులకు వినియోగించుకోలేదని స్పష్టం చేశారు.

పెళ్లి శుభలేఖలు కూడా తన సొంత కారులోనే వెళ్లి పంచానని గుర్తు చేశారు. ప్రభుత్వ వాహనాల్లో పెళ్లికి హాజరైనంత మాత్రాన వారిని వాడుకున్నట్టు కాదని అన్నారు. రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర మోడీ వంటి వారికి ప్రొటోకాల్ ప్రకారమే అధికార యంత్రాంగాన్ని వినియోగించామని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News