: వ్యవసాయానికి ప్రాముఖ్యత తగ్గింది.. ఫాం హౌస్ నుంచి కేసీఆర్
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. మెదక్ జిల్లాలోని ఆయన ఫాం హౌస్ నుంచి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వ్యవసాయ రంగంలో పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. వ్యవసాయశాఖ విస్తరణ విభాగం ఆదరణకు నోచుకోలేదని అన్నారు. వ్యవసాయ నిపుణులకు ఆదరణ లేకుండా పోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ప్రతి దళిత రైతుకూ 3 ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ తెలిపారు. రైతులకు సాంకేతిక పరమైన అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన రుణంతోనే తాను వ్యవసాయం చేశానని కేసీఆర్ వెల్లడించారు.