: రాజీనామాపై వెనక్కి తగ్గిన పెద్దిరెడ్డి
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనసు మార్చుకున్నారు. నిర్ణయం వెనక్కి తీసుకుంటూ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు రాజీనామా చేసిన వెంటనే జైల్లో జగన్ ను కలిసిన పెద్దిరెడ్డి... వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సంకేతాలిచ్చారు కూడా.
దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెద్దిరెడ్డిని బుజ్జగించారని, అందువల్లే రాజీనామాపై వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఏది ఏమైనా, పెద్దిరెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటిలోకే చేరడం విశేషం.