: కావూరి పర్యటన.. సమైక్య వాదుల అరెస్టు
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పశ్చిమగోదావరిలో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి కావూరి పర్యటనకు అడ్డుతగులుతారని భావించిన పోలీసులు దాదాపు 100 మంది సమైక్యవాదులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు పెల్లుబుకుతున్నాయి. నేరగాళ్లు, రౌడీలను ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు, సమైక్యవాదులను ముందుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడుతున్నారు. అడ్డుతగులుతారని తెలిసినప్పుడు ప్రజాభీష్టానికి అనుకూలంగా నడవాలని లేక పర్యటన రద్దు చేసుకోవాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు.