: మద్దతు ఉపసంహరిస్తే కాంగ్రెస్ ను ప్రజలు క్షమించరు: ఆమ్ఆద్మీ
ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమ్ ఆద్మీ నేత ప్రశాంత్ భూషణ్ అన్నారు. తమ తదుపరి లక్ష్యం లోక్ సభ ఎన్నికలేనని ముంబై వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ తో తమకు ఎలాంటి భాగస్వామ్యం లేదని, ఆ పార్టీ తన అవసరాల రీత్యా తప్పనిసరై తమకు మద్దతిస్తోందన్నారు.