: గ్యాస్ ధరల పెంపుపై వెనక్కు తగ్గం: మొయిలీ
నిన్న భారీగా పెంచిన గ్యాస్ ధరలపై వెనక్కు తగ్గేదిలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పెంచిన వాటిలో కేవలం 10 శాతం ప్రజలపై మాత్రమే ప్రభావం పడుతుందని చెప్పారు. గ్యాస్ ధరలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.