: విరాట్ కోహ్లీ.. అనుష్కశర్మ మధ్య ఏం నడుస్తోంది?
దక్షిణాఫ్రికా నుంచి భారత జట్టు ముంబైలో వాలింది. విమానాశ్రయం నుంచి అందరు క్రికెటర్లు వెళ్లిపోయారు. కోహ్లీ మాత్రం 20 నిమిషాల పాటు అక్కడే కళ్లు పెద్దవి చేసుకుని వేచి చూశాడు. ఇంతలో బాలీవుడ్ నటి అనుష్కశర్మ గ్రే కలర్ రేంజ్ రోవర్ వచ్చి ఆగింది. అందులో తన లగేజ్ ను మాత్రమే పెట్టిన కోహ్లీ దాని వెనుక మరో వైట్ కలర్ ఆడిలో ఎక్కి అనుష్కశర్మ ఇంటికి అర్ధరాత్రి చేరుకున్నాడు. కోహ్లీ ముంబైలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం అనుష్కతోనే గడుపుతాడని.. వారిద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళుతుంటారని నటి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక షాంపూ యాడ్ లో కలసి నటించాక వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది ఎక్కడి వరకూ దారితీస్తుందో చూడాలి.