: 'నువ్వెంత అంటే నువ్వెంత' అంటూ తోసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ నేత
ఎమ్మెల్యే, టీడీపీ నేత నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తోసుకున్నారు. నేతలే తోసుకుంటే కార్యకర్తలం తక్కువ తిన్నామా? అంటూ వారు కూడా తోపులాటకు దిగిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వాంబే గృహాల కేటాయింపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్తా పెరిగి తోపులాటకు దారితీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు కూడా తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు కల్పించుకుని నేతలకు సర్ది చెప్పారు.