: హైదరాబాదు బంజారాహిల్స్ టిఫిన్ బండివద్ద పేలిన గ్యాస్ సిలిండర్లు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ ఒకటిలో సిటీ సెంటర్ వద్ద టిఫిన్ బండి నడుపుతున్న చోట రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. పేలుడుతో నాలుగు చక్రాల టిఫిన్ బండి పూర్తిగా కాలిపోగా, అక్కడున్న వారికి ప్రమాదం తప్పింది. ఎప్పటినుంచో అక్కడే ఓ వ్యక్తి టిఫిన్ బండి నడుపుతున్నాడు. ఈ ఉదయం టిఫిన్ తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలి ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.