: మంచులో చిక్కుకున్న ఓడ.. బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు


అంటార్కిటికా మంచులో అకాడమిక్ షోకాల్ స్కీ అనే రష్యన్ ఓడ చిక్కుకుపోయింది. డగ్లస్ మాసన్ అంటార్కిటికా యాత్ర శతవార్షికోత్సవానికి గుర్తుగా చేపట్టిన ఈ యాత్రలో 52 ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరి యాత్ర న్యూజీలాండ్ నుంచి నవంబర్ 28న బయలుదేరింది. తీవ్రమైన మంచుకారణంగా డిసెంబర్ 24న ఫ్రెంచ్ అంటార్కిటిక్ స్టేషన్ కు తూర్పున 100 నాటికల్ మైళ్ల దూరంలో వీరి ఓడ చిక్కుకుపోయింది. సముద్రంలో దాదాపు పది అడుగుల లోతు వరకు మంచు పేరుకుని ఉండడంతో ఓడ ఎటూ కదల లేకపోతోంది.

అయితే వీరిని హెలీకాప్టర్ ద్వారా రక్షించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, విపరీతంగా కురుస్తున్న మంచు, తీవ్ర గాలుల కారణంగా సహాయక చర్యలు జరిగే పరిస్థితి లేదు. దీంతో 52 మంది ప్రయాణికులు క్రిస్ మస్, కొత్త సంవత్సరం వేడుకలను బిక్కుబిక్కుమంటూ ఓడలోనే జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News