: రిటైర్ మెంట్ కు చేరువలో సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్.. భారత క్రికెట్ జట్టులో కనిపించక చాలా నెలలు అయింది. 251 వన్డేలు, 104 టెస్టుల్లో భారత్ తరఫున ఆడిన సెహ్వాగ్.. గతేడాది మార్చి తర్వాత మళ్లీ ఇంతవరకూ టీమ్ లో కనిపించలేదు. సొంతగడ్డపై ఆసీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో పేలవ ప్రదర్శన.. ఢిల్లీ రంజీ ట్రోఫీలోనూ ఆకట్టుకోని ఆటతీరు అతడికి ప్రతికూలంగా మారింది. సెహ్వాగ్ వయసు 35 ఏళ్లు. దూకుడుగా ఆడే యువ ఆటగాళ్లు పుష్కలంగా ఉన్నందున సెహ్వాగ్ తన ఆటను మెరుగు పరచుకుంటే తప్ప అతడికి అవకాశాలు రావడం కష్టమే. సెహ్వాగ్ తో కలిసి ఆడిన సీనియర్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి వారందరూ ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఇక సెహ్వాగ్ వంతే రానుంది.