: న్యూఇయర్ సందర్భంగా 268 కోట్లు తాగేశారు
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మందుబాబులు మస్తు మజా చేశారు. మూడు ఫుల్లులు, ఆరు హాఫులతో మత్తులో మునిగిపోయారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 268 కోట్ల రూపాయల మందును లాగించేశారు. ఐదు లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం, 2.55 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. అంచనాలకు మించి మద్యం అమ్ముడుపోవడంతో, ఎక్సైజ్ అధికారులు ఆనందంలో మునిగిపోయారు.